విజిల్‌ మూవీ రివ్యూ

25 Oct, 2019 13:52 IST|Sakshi
Rating:  

టైటిల్‌: విజిల్‌ (తమిళంలో బిగిల్‌)
జానర్‌: మాస్‌ యాక్షన్‌-స్పోర్ట్స్‌ డ్రామా
నటీనటులు : విజయ్‌, నయనతార, జాకీష్రాఫ్‌, కదీర్‌, యోగిబాబు
సంగీతం : ఏఆర్‌ రహమాన్‌
దర్శకత్వం : అట్లీ
నిర్మాతలు:  కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేశ్‌, కల్పాతి ఎస్‌ సురేశ్‌

వరుస విజయాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్న తమిళ స్టార్‌ హీరో  విజయ్‌. మెర్శల్‌, సర్కార్‌ వంటి భారీ సూపర్‌హిట్స్‌ ఊపుమీదున్న ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి ‘విజిల్‌’ అనే స్పోర్ట్స్‌ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్‌-అట్లీ కాంబినేషన్‌లో తేరి, మెర్శల్‌ వంటి బాక్ల్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్‌ డ్యుయల్‌ రోల్‌ చేస్తుండటంతో..  హ్యాట్రిక్‌ సూపర్‌హిట్‌ ఖాయమని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్‌. విజయ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘విజిల్‌’ ఎలా ఉంది? ప్రేక్షకులతో ఈల వేయించిందా? ఓసారి తెలుసుకుందాం పదండి.

కథ:
మైఖేల్‌ రాజప్ప (విజయ్‌) స్థానికంగా మంచి రౌడీ. తన మురికివాడలోని వాళ్లను ప్రత్యర్థుల నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. స్థానికంగా మంత్రి కాలేజీ మూయించాలని చూస్తే దానిని అడ్డుకుంటాడు. ప్రత్యర్థులు చెడు చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అమ్మాయిల ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌ అయిన మైఖేల్‌ స్నేహితుడు కిరణ్‌ తన టీమ్‌ను తీసుకొని అతను ఉండే చోటుకి వస్తాడు. కిరణ్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రత్యర్థులు మైఖేల్‌పై అటాక్‌ చేస్తారు. ఈ దాడిలో మైఖేల్‌ రౌడీలను చితగ్గొట్టినప్పటికీ.. అతని విరోధి మాత్రం కిరణ్‌ను గొంతులో కత్తితో పొడుస్తాడు.  దీంతో చికిత్స పొందుతూ.. ఆస్పత్రి బెడ్‌కు పరిమితమైన కిరణ్‌.. తనస్థానంలో మైఖేల్‌ను అమ్మాయిల టీమ్‌కు కోచ్‌గా వెళ్లమని కోరుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో బిగిల్‌గా పేరొందిన మైఖేల్‌ గొప్ప ఫుట్‌బాల్‌ ఆటగాడు. అతని తండ్రి రాజప్ప (విజయ్‌) స్థానికంగా పేరుమోసిన రౌడీ. అయినా తన కొడుకు కత్తి పట్టకుండా ఆటలతో పైకి రావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో అతను, అతని స్నేహితులు కలిసి నేషనల్‌ గేమ్స్‌ ఆడేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్‌లో ప్రత్యర్థులు అటాక్‌ చేసి.. మైఖేల్‌ కళ్లముందే రాజప్పను చంపేస్తారు. దీంతో జాతీయ కప్‌ కొట్టాలన్న తన తండ్రి కల రైల్వే స్టేషన్‌లో ఆగిపోతుం‍ది. పుట్‌బాల్‌ ప్లేయర్‌ కావాలనుకున్న మైఖేల్‌ తండ్రి స్థానంలోకి రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో కిరణ్‌ కోరిక మేరకు అమ్మాయిల జట్టుకు కోచ్‌గా మారిన మైఖేల్‌.. బిగిల్‌ కప్పు ముఖ్యంరా అన్న తండ్రి కలను నెరవేర్చాడా? కోచ్‌గా ఎలా నిలదొక్కుకు‍న్నాడు? నేషనల్‌ గేమ్స్‌లో అతనికి ఎదురైన అవాంతరాలు ఏమిటి? అమ్మాయిలు సమాజంలోని ప్రతికూలతలను ఎదుర్కొని ఎలా పోరాడారు? అన్నది తర్వాతి కథ.

విశ్లేషణ:
స్పోర్ట్స్‌ డ్రామాకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. తెరమీద కనిపిస్తున్న ఆట నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తూ.. అందులో ప్రేక్షకుడిని మమేకం చేయాలి. అప్పుడే తెరమీద భావోద్వేగాలు పండుతాయి. షారుఖ్‌ ఖాన్‌ ‘చక్‌ దే ఇండియా’, సల్మాన్‌ ఖాన్‌ ’సుల్తాన్‌’,, ఆమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’, మాధవన్‌ ‘గురు’ సినిమాలు ఈవిధంగా తెరమీద భావోద్వేగాలను అద్భుతంగా పండించి.. ప్రేక్షకులతో శెభాష్‌ అనిపించుకున్నాయి. బిగిల్‌ పేరుకు స్పోర్ట్స్‌ డ్రామా అయినా అందులో ఫక్తు మాస్‌ యాక్షన్‌ సీన్లు బోలెడు ఉన్నాయి. విజయ్‌లాంటి స్టార్‌ హీరోతో పూర్తిస్థాయి స్పోర్ట్స్‌ డ్రామా చేయడం బాగుండదనుకున్నాడేమో డైరెక్టర్‌.. కథ కంటే కూడా ప్రతి 20, 30 నిమిషాలకు ఒక ఫైట్‌ సీన్‌..హీరోను ఎలివేట్‌ చేసే సీన్లతో విసిగించాడు. అంతేకాకుండా సినిమా నిడిమి చాలా ఎక్కువైపోవడంతో కథ మీద దర్శకుడికి పట్టు తప్పినట్టు కనిపిస్తుంది. చాలా సీన్లు సాగదీతతో ఉండి.. తమిళ వాసనలతో బోర్‌ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌ భరించడం చాలా కష్టమే. ఫస్టాఫ్‌లో తండ్రీ-కొడుకుగా డ్యుయల్‌ రోల్స్‌లో విజయ్‌ పండించిన వేరియేషన్స్‌, వారి మధ్య అనుబంధం కొంచెం ఆకట్టుకుంటుంది. ఇక, ఫస్టాఫ్‌లో కనిపించే తండ్రి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు కనిపించదు. రాజప్ప నేపథ్యమేమిటో పూర్తిగా చూపించకుండానే దర్శకుడు అర్ధంతరంగా ముగించేసిన భావన కలుగుతుంది.

ఇక, ఫస్టాఫ్‌లో సాఫ్ట్‌రోల్‌లో కనిపించిన ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జేకే శర్మ (జాకీష్రాఫ్‌)  సెకండాఫ్‌లో విలన్‌గా అవతారమెత్తుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో రాజప్ప తనను చితకబాదినందుకు.. ఇప్పుడు కోచ్‌ మైఖేల్‌, అతని టీమ్‌ను ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇలా మైదానంలో క్రీడాపరమైన ఉద్వేగాల కంటే.. హీరో-విలన్‌ మధ్య పోటాపోటీ  సీన్లు.. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసినందుకు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే, మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్‌బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్‌ దాడికి గురైన అమ్మాయి.. కోచ్‌ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన యువతి తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇక, ఫుట్‌బాల్‌ గేమ్‌లోనూ భావోద్వేగాల కంటే.. ప్రేక్షకులను కట్టిపడేసి విన్యాసాలను చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్రధాన అస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా శివంగివే పాట స్ఫూర్తిదాయకంగా ఉంది. జీకే విష్ణు నీట్‌ సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ డైరెక్టర్‌ ముథురాజు పనితనం సినిమాలో కనిపిస్తోంది. చిత్రస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమాకు బాగా కత్తెరవేసి.. ట్రిమ్‌ చేసి.. కథను క్రిస్ప్‌గా తెరకెక్కించి ఉంటే బాగుండేది.  ఎప్పటిలాగే విజయ్‌ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అతన్ని ప్రేమించే ఏంజిల్‌ ఆశ్విరాదంగా ఓ మోస్తరు పాత్రకు నయనతార పరిమితమైంది.

బలాలు
విజయ్‌ యాక్టింగ్‌
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
నిర్మాణ విలువలు

బలహీనతలు
ఫస్టాఫ్‌
సాగదీత సీన్లు
సినిమా నిడివి
రోటిన్‌ హీరోయిజం, ఫైట్లు

- శ్రీకాంత్‌ కాంటేకర్‌

Rating:  
(2/5)
Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మత్తు వదలరా’మూవీ రివ్యూ

బుంగమూతి పిల్ల

ఆరు గంటలకు టేక్‌

ప్రతి ఊరిలో ఓ ఉత్తర ఉంటుంది

రాజా వస్తున్నాడు

నా లైఫ్‌ బ్యూటిఫుల్‌

మళ్లీ రైడ్‌

అప్పుడు కథకు అన్యాయం చేసినవాళ్లం అవుతాం

థియేటర్లు మూసేస్తాం; చిత్రసీమకు షా​క్‌

అనాథ పిల్లలకు ‘వెంకీ’మామ గిఫ్ట్‌

‘దబాంగ్‌ 3’ కలెక్షన్లు అంతేనా!

‘బుట్టబొమ్మా’కు ఫ్యాన్స్‌ ఫిదా 

వివాదాల్లో ‘ఛపాక్‌’ సినిమా

వేశ్య అని వేధించేవారు: బాలీవుడ్‌ నటి

ఈ సారి క్రిష్‌గా కాదు కృష్ణుడిగా?

చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు

టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు

టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి

పిప్రిలో హీరో నాగచైతన్య, సాయిపల్లవి సందడి

ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌

సెలవులు వస్తాయనీ అమ్మాయిలకు సైట్‌ కొట్టవచ్చని..

మద్యపానం మానేశా : నటి

నన్ను సైకో సత్య అంటారు

మరో థ్రిల్లర్‌

శశి కథేంటి?

సీక్వెల్‌లో

ఖోఖో నేపథ్యంలో...

అక్షర సందేశం

నాన్నకు తెలియకుండా సినిమా చేశా

అదిరిపోయిన వర్మ ‘బ్యూటిపుల్‌’ సాంగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మత్తు వదలరా’మూవీ రివ్యూ

బుంగమూతి పిల్ల

ఆరు గంటలకు టేక్‌

ప్రతి ఊరిలో ఓ ఉత్తర ఉంటుంది

రాజా వస్తున్నాడు

నా లైఫ్‌ బ్యూటిఫుల్‌