నిన్ను హీరోయిన్‌ చేసిందెవరు?

19 Apr, 2018 20:05 IST|Sakshi

సాక్షి, సినిమా : ఏ నటుడు, నటి అయినా అభిమానుల ప్రేమాభిమానాలే తమ ఈ స్థాయికి కారణం అంటుంటారు. అయితే అందరు అభిమానులు ఒకేలా ఉండరు. ఇక అందరు తారలు అందరికీ నచ్చాలని లేదు. ఒక్కోసారి అభిమానుల వల్లే హర్ట్‌ అయ్యే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే నటి తాప్సీకి ఒక అభిమాని షాక్‌ ఇచ్చాడు. నటి తాప్పీ ఇంతకుముందు దక్షిణాది చిత్రాల్లో నటించినా.. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైపోయ్యింది. అలా అనేకంటే దక్షిణాదిలో అవకాశాలు పూర్తిగా అటకెక్కాయని చెప్పొచ్చు. 

ఈ అమ్మడు ట్విటర్‌లో తరచూ అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంటుంటుంది. అలాంటి ఒక సందర్భంలో తన ఫొటోని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోను చూసిన ఒక అభిమాని నిన్ను కూడా కథానాయకిని చేసిందెవరు? అంటూ ప్రశ్నించాడు. అంతే అభిమాని నుంచి అలాంటి ప్రశ్నను ఊహించని తాప్సీ షాక్‌ అయ్యిందట. కోపం కూడా తన్నుకొచ్చిందట. తరువాత తేరుకుని ఆ అభిమానికి కొంచెమైనా నటించడం వల్లే నన్ను కథానాయకిని చేశారని బదులిచ్చింది. 

అయినా నేను సాధారణ అమ్మాయిగా ఉండడంలో సమస్యేమీ లేదుగా, ఈ లోకంలో నాలాంటి సరాసరి అమ్మాయిలే అధికంగా ఉంటారు అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో నాలుగు చిత్రాలు చేస్తుంది. ఇంతకు ముందు నటించిన పింక్, నామ్‌ షబానా చిత్రాలు సక్సెస్‌తో తాప్సీ హిందీలో సెటిల్‌ అయిపోయ్యింది. నటిగా తనకంటూ కొత్త బాటను వేసుకునే ప్రయత్నంలో ఉన్నానని, తనలోని నటనా ప్రతిభను వెలికితీసే పాత్ర ఇంకా రాలేదని, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తాప్సీ అంటోంది. అదే విధంగా సినిమా రంగంలో తనకంటూ స్నేహితులెవరూ లేరని పేర్కొంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు