‘యన్‌.టి.ఆర్‌’లో బాలయ్య ఎవరంటే..?

26 Dec, 2018 11:34 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తొలి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే బాలకృష్ణ పాత్రలో ఎవరు కనిపించనున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

బాలకృష్ణ చిన్నప్పటి పాత్రను ఆయన మనవడు చేస్తున్నట్టుగా ప్రకటించిన హీరో అయ్యాక కనిపించే సన్నివేశాల్లో ఆ పాత్ర ఎవరు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా బాలయ్య పాత్రలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారట. తండ్రి పాత్రతో పాటు తన పాత్రలోనూ తానే కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మరి అసలు విషయం తెలియాలంటే రిలీజ్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ సులభం కాదు

అమెరికాలో అతను డాక్టర్‌ కపూర్‌

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు