ఎన్టీఆర్‌ ఆ ఇద్దరి పేర్లు ఎప్పుడు చెప్తాడో..!

29 Oct, 2017 11:34 IST|Sakshi

జై లవ కుశ సినిమాతో మరోసారి ఘన విజయాన్ని అందుకున్నయంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అభిమానులకు ఇచ్చిన ఒక మాటను మాత్రం మరిచిపోయాడు. జై లవ కుశ రిలీజ్‌కు ముందు జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు ఓ మాట ఇచ్చాడు. తాను జై లవ కుశ సినిమా అంగీకరించడానికి ఇద్దరు వ్యక్తులు కారణం అని, వారి పేర్లు సినిమా ఘనవిజయం సాధించిన తరువాత తెలియజేస్తానన్నాడు. జై లవ కుశ సూపర్‌ హిట్‌ అని కన్ఫమ్‌ అయిపోయింది. దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్‌ కూడా సాధించింది.

మరి ఇంతవరకు ఎన్టీఆర్‌ ఆ ఇద్దరు ఎవరన్న విషయం మాత్రం బయట పెట్టలేదు. అభిమానులు ఆ ఇద్దరు ఎవరై ఉంటారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవ కుశలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేయగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర​ కెరీర్‌లోనే బిగెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన జై లవ కుశ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు