భార్య కంటే కత్తి మంచిది

22 Jul, 2019 04:08 IST|Sakshi
గుంజన్, అభిషేక్‌

‘ఏడుచేపల కథ’ చిత్రంలో టెంప్ట్‌ రవిగా క్రేజ్‌ సంపాదించుకున్న అభిషేక్‌ రెడ్డి, గుంజన్‌ జంటగా నటించిన  చిత్రం ‘వైఫ్,ఐ’. ‘నైఫ్‌ బెటర్‌ దెన్‌ వైఫ్‌’(భార్య కంటే కత్తి మంచిది) అన్నది ఉపశీర్షిక. ‘అంతం’ ఫేమ్‌ జి.ఎస్‌.ఎస్‌.పి.కల్యాణ్‌ దర్శకత్వంలో లక్ష్మి చరిత ఆర్ట్స్‌– జిఎస్‌ఎస్‌పికె స్టూడియోస్‌ పతాకాలపై జి.చరితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. జి.ఎస్‌.ఎస్‌.పి కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రం ‘అంతం’ కమర్షియల్‌గా చాలా మంచి విజయాన్ని సాధించింది. మంచి కథ కోసమే ఇన్ని రోజులు  ఆగాల్సి వచ్చింది. సమాజంలో జరుగుతున్న ఒక మంచి పాయింట్‌ని ‘వైఫ్, ఐ’ చిత్రంలో చాలా వినోదాత్మకంగా చూపించాం. భార్యాభర్తల మధ్య ఉండే అన్ని బంధాలు ఇందులో ఉంటాయి.

రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన మా చిత్రం ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలువుతాయి’’ అన్నారు. జి.చరితా రెడ్డి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌ చెప్పిన కథ విన్నవెంటనే ఓకే చేశాను. ఎందుకంటే.. ఇలాంటి కథలు ఈ జెనరేషన్‌లోనే రావాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ పోయి అసూయ పెరుగుతోంది.. వైవాహిక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వీటికి కారణం ఏంటని తెలుసుకోలేకపోతున్నారు. మా చిత్రంలో ఆ విషయాన్నే ప్రస్తావించాం. ప్రతి మనిషీ తప్పులు చేస్తారు.. ఆ తప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని చూపిస్తున్నాం’’ అన్నారు.  కావ్య, సునీల్‌ నగరం, సూర్య ఆకోండి, మహేష్‌ విట్ట, అపర్ణ నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య.

మరిన్ని వార్తలు