ఆపరేషన్‌ బ్యాంకాక్‌

24 Jan, 2020 03:12 IST|Sakshi
విష్ణు ఇందూరి, షిబాసిస్, నాగార్జున, కబీర్‌ ఖాన్‌

‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రం కోసం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌ వర్మగా మారారు నాగార్జున. డిపార్ట్‌మెంట్‌లో అందరూ ఆయన్ను వైల్డ్‌ డాగ్‌ అంటుంటారు. ప్రస్తుతం ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ మీద ముంబైలో ఉన్నారు. నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మాన్‌ రూపొందిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ తర్వాత మార్చి 5 నుంచి బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్‌ ఆరంభించాలనుకుంటున్నారట టీమ్‌. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించ నున్నారట. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌.  

83ని సమర్పించడం సంతోషంగా ఉంది: నాగార్జున
1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ చేశారు. విష్ణు ఇందూరి నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సమర్పించనున్నారు. ‘‘1983లో భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచ కప్‌ గెలిచింది. ఆ సంఘటనను ఎప్పుడు తలుచుకున్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలుగులో ఈ సినిమాను సమర్పించడం సంతోషంగా ఉంది’’ అన్నారు నాగార్జున. ‘‘అన్నపూర్ణ సంస్థతో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో షిబాసిస్‌ సర్కార్‌ అన్నారు. ‘83’ చిత్రాన్ని తమిళంలో కమల్‌హాసన్‌ సమర్పిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా