సోనియాతో అమితాబ్ కు ఉన్న విభేదాలే కారణమా?

18 Sep, 2014 03:06 IST|Sakshi
సోనియాతో అమితాబ్ కు ఉన్న విభేదాలే కారణమా?
పనాజీ: ఇంతకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హాజరవుతారా అంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. నవంబర్ 20 తేది నుంచి ప్రారంభం కానున్న 45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) ముఖ్య అతిధిగా అమితాబ్ హాజరయ్యేది లేనిది వెల్లడించకపోవడంపై అనేక సందేహాలు తావిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అమితాబ్ కు మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇప్పటి వరకు ఇఫీలో పాల్గొనలేదని నిర్వాహకులు వెల్లడించారు.  
 
ముఖ్య అతిధిగా అమితాబ్ హాజరవుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ... 'ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం, బహిష్కరించడం లాంటి అంశాలు తమ దృష్టికి రాలేదు. త్వరలోనే ముఖ్య అతిధి ఎవరు అనే అంశం కొలిక్కి వస్తుంది' అని అన్నారు. 
 
గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి గోవా శాశ్వత వేదికగా మారిన తర్వాత ఇప్పటి వరకు అమితాబ్ ముఖ్య అతిధిగా వ్యవహరించలేదు. కాని హెచ్ఐవీ/ఎయిడ్స్ మీడియా క్యాంపెన్ కు బ్రాండ్ అంబాసిడర్ హోదాలో మాత్రమే హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో బిగ్ బీకి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది.