జోరు పెంచిన కమల్ హాసన్

21 Jun, 2014 15:32 IST|Sakshi
జోరు పెంచిన కమల్ హాసన్

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ ఏడాది జోరు పెంచారు. కమల్ నటించిన మూడు సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదలయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం తమిళ హాస్యం చిత్రం 'ఉత్తమ విలన్'లో నటిస్తున్నారు.

'విశ్వరూపం' సినిమాకు సీక్వెల్గా కమల్ హీరోగా రూపొందిస్తున్న 'విశ్వరూపం2' విడుదలకు సిద్ధమైంది. 'విశ్వరూపం2'  చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఏ సమయంలోనైనా విడుదల కావచ్చని కమల్ చెప్పారు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తీస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'దృశ్యం'ను తమిళంలో కమల్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 15న ఆరంభం కానుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయనున్నట్టు దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒకే ఏడాదిలో కమల్ మూడు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.