మెగాస్టార్‌తో నాగ్‌ అశ్విన్‌ సినిమా...?

12 May, 2018 15:05 IST|Sakshi

మహానటి మూవీతో అభిరుచి గల డైరెక్టర్‌ అని నిరూపించుకున్నారు నాగ్‌ అశ్విన్‌. తీసింది రెండు సినిమాలే అయినా... రెండూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మహానటి సినిమా విడుదలైనప్పటి నుంచి నాగ్‌ అశ్విన్‌ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా కోసం నాగ్‌ పడిన కష్టం తెరపైన కనపడుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు మహానటి దర్శక నిర్మాతలను సత్కారించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అశ్వనీదత్‌ మాట్లాడుతూ... గత రెండు మూడేళ్లుగా చిరంజీవి గారికి ఎన్నో కథలు వినిపిస్తున్నాము, కానీ కుదరట్లేదు. మా కాంబినేషన్‌లో ఒక పెద్ద సినిమా ఉంటుంది. నాగ్‌ అశ్విన్‌ కూడా ఒక లైన్‌ అనుకున్నారని.. సినిమా పేరు భైరవ అని... టైమ్‌ మిషన్‌ కాన్సెప్ట్‌తో సినిమా ఉండొచ్చని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. నాకూ పాతాళ భైరవి లాంటి సినిమా, జానపద నేపథ్యంలో, మాయలు మంత్రాలు లాంటి సినిమా చేయాలని ఉందంటూ తెలిపారు. 

వైజయంతీ మూవీస్‌, చిరంజీవి, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా మాత్రం ఉంటుందని తెలిసిపోయింది. అయితే అది ఇప్పట్లో మాత్రం కుదిరేలా లేదు. చిరంజీవి ప్రస్తుతం సైరాతో బిజీగా ఉన్నారు. తరువాత బోయపాటి శీను, త్రివిక్రమ్‌, కొరటాల శివతో సినిమాలు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నంటిలో ఏది పట్టాలెక్కుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ