‘బిగ్‌బాస్‌ 2’లో నందమూరి హీరో?

2 Jun, 2018 13:30 IST|Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ షోకు ఎంత క్రేజ్‌ వచ్చిందో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు కూడా అంతే క్రేజ్‌ వచ్చింది. ఇలాంటి రియాల్టీ షోలు కేవలం బాలీవుడ్‌ వాళ్లే కాదు మనోళ్లు కూడా రక్తికట్టించగలరని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ రెండో సీజన్‌కు నాచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సారి ఇంకొం‍చెం మసాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండో సీజన్‌లో పాల్గొనే వ్యక్తులు వీరే నంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజం కాదంటూ ఆ షోలో మేము పాల్గొనడం లేదంటూ కొందరు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా నందమూరి హీరో తారకరత్న ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే బిగ్‌ బాస్‌ బృందం కానీ, తారకరత్న కానీ స్పందించేవరకు వేచి చూడాలి. 
 

మరిన్ని వార్తలు