డబుల్‌ ధమాకా!

22 Feb, 2019 01:53 IST|Sakshi

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘2.ఓ’ చిత్రంలో శాస్త్రవేత్తగా, రోబోగా రజనీకాంత్‌ రెండు పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల టాక్‌. ఇందులో సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో రజనీకాంత్‌ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ ఈ వార్త నిజం అయితే... మళ్లీ రజనీ అభిమానులకు డబుల్‌ ధమాకానే. ఒకవేళ రెండు పాత్రలు చేస్తే అప్పుడు ఇద్దరు హీరోయిన్లకు ప్లేస్‌ ఉంటుంది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ నయనతార, కాజల్‌ అగర్వాల్‌ల పేర్లు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. మరి.. రజనీ సరసన జోడీ కట్టే ఇద్దరు భామలు ఎవరో మార్చిలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో స్టార్ట్‌ అవుతుందని సమాచారం. అన్నట్లు.. ఇంతకుముందు ‘రాజాధిరాజా (1989), అదిశయ పిరైవి (1989), ముత్తు (1995), అరుణాచలం (1997)’ చిత్రాల్లో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కు లైన్‌ క్లియర్‌

డ్రైవర్‌, పనిమనిషికి హీరోయిన్‌ భారీ సాయం

సౌత్‌లో మరో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌

ప్రజలను చైతన్య పరుస్తాం : పృథ్వీ

వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల వాయిదా

డ్రైవర్‌, పనిమనిషికి హీరోయిన్‌ భారీ సాయం

సౌత్‌లో మరో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌

ముందే వస్తున్న మోదీ బయోపిక్‌

వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి

నయన్‌ది ఆశా? అత్యాశా?