ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్‌’ అన్న పదం వినిపించదా!

28 Aug, 2019 13:48 IST|Sakshi

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసింది. వందకోట్ల వసూళ్లు సాధించటమే టార్గెట్ అనుకున్న ఇండియన్‌ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో వసూళ్లకు గేట్లు తెరిచింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా బాహుబలి విజయం ముందు దాసోహం అన్నాయి. బాహుబలి రిలీజ్ తరువాత ఆ రికార్డ్‌లను చెరిపేసేందుకు బాలీవుడ్ చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి.

కానీ ఇప్పుడు సాహో సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో మరోసారి బాహుబలి రికార్డ్‌లపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు భారీ విజయం సాధించిన సినిమాలను నాన్‌ బాహుబలి రికార్డ్‌ సాధించిందంటూ చెపుతూ వస్తున్నారు. కానీ సాహో రిలీజ్‌ తరువాత రికార్డ్‌లకు సరికొత్త స్టాండర్ట్స్‌ సెట్ అవుతాయంటున్నారు ఫ్యాన్స్‌. సాహో.. బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేయటం ఖాయం అని భావిస్తున్నారు.

అయితే విశ్లేషకుల మాట మాత్రం మరోలా ఉంది. సాహో మీద భారీ అంచనాలు ఉన్నా బాహుబలి మార్క్‌ను అందుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే దాదాపు 400 వందల కోట్ల వసూళ్లు సాధించాలి. కేవలం బాలీవుడ్‌లోనే 125 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయి వసూళ్లు సాహోకు సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాహుబలి కాస్ట్యూమ్‌ డ్రామా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో రెగ్యులర్‌ సోషల్ యాక్షన్‌ కథ కావటంతో ఆ స్థాయిలో అంచనాలు కష్టమే అంటున్నారు. హిందీలో ఇప్పటికే ధూమ్‌ లాంటి యాక్షన్ సినిమాల చాలా వచ్చాయి. మరి సాహో వాటిని మించి బాలీవుడ్ జనాలు సాహో అలరిస్తుందా లేదా చూడాలి.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా