దుల్క‌ర్ స‌ల్మాన్‌పై రిపోర్ట‌ర్ ఆగ్ర‌హం

22 Apr, 2020 17:57 IST|Sakshi

అనుమ‌తి లేకుండా త‌న ఫోటోలు ఎలా ఉప‌యోగించారంటూ చిత్ర‌బృందంపై ఓ మ‌హిళా రిపోర్ట‌ర్ ఫైర్ అయ్యింది. సినిమా నుంచి తన ఫొటోను తొలగించాలని లేదా బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వివ‌రాల్లోకి వెళితే.. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన `వారనె అవశ్యముండ్` సినిమాలో బ‌రువు త‌గ్గించే  ఓ క్లినిక్ పై స‌ద‌రు మ‌హిళా రిపోర్ట‌ర్ చేత‌న ఫోటోలను ఉప‌యోగించారు చిత్ర‌బృందం. దీంతో ఫైర్ అయిన ఆమె  అనుమ‌తి లేకుండా బాడీ షేమింగ్ గురించి త‌న ఫోటోలు ఎలా ముద్రించారంటూ ఫైర్ అయ్యింది.

దీంతో దుల్కర్ సల్మాన్ వెంటనే స్పందించాడు. `దీనికి మేం పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను. మీ ఫొటోను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనుక్కుంటాను. నా తరఫున, మా చిత్రబృందం తరఫున నేను క్షమాపణలు చెబతున్నాను` అంటూ దుల్కర్ రిప్లై ఇచ్చాడు. దర్శకుడు కూడా చేతనకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. ఇంత త్వ‌ర‌గా రియాక్ట్ అయ్యి క్ష‌మాప‌ణ‌లు చెప్పినందుకు ద‌న్య‌వాదాలు. డైరెక్ట‌ర్‌తో మాట్లాడాను. స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని చేత‌న పేర్కొన్నారు. దుల్క‌ర్‌ స‌ల్మాన్ మొట్ట‌మొద‌ట‌గా నిర్మించిన వారణే అవశ్యామున్ బాక్సాఫీస్ వద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ఈ చిత్రంలో ఈ చిత్రంలో సురేష్ గోపి, శోభన, కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు