పనే దైవం! - మోహన్‌బాబు

23 Jan, 2015 23:25 IST|Sakshi
పనే దైవం! - మోహన్‌బాబు

నేను, రవిరాజా మంచి స్నేహితులం. ‘నాకు తెలిసిన మంచి రైటర్ ఉన్నాడు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు’ అని ఎమ్మెస్ గురించి రవిరాజా చెబితే, ‘ఎం. ధర్మరాజు ఎం.ఎ’ ద్వారా పరిచయం చేశాం. మనిషిని చూడకపోయినా రవిరాజా చెప్పాడు కాబట్టి, తీసుకున్నాం. ఆ తర్వాత మా సంస్థ నిర్మించిన పలు చిత్రాల్లో నటించాడు. ఎమ్మెస్ మంచి వ్యక్తి. లొకేషన్లో తానేంటో తన పనేంటో అన్నట్లుగా ఉండేవాడు.

ఏదైనా సన్నివేశం తృప్తిగా అనిపించకపోయినా, డైలాగ్‌ని మార్చాలన్నా, మొహమాటపడకుండా చెప్పేవాడు. ఎంత బిజీగా ఉన్నా మా సంస్థలో నిర్మించే సినిమాకి డేట్స్ కేటాయించడానికి తపన పడేవాడు. ‘పెదరాయు డు’లో చూసి గొప్ప నటుడవుతాడనుకున్నాను. అది నిజమైంది. వ్యక్తిగతంగా సమస్య (ఆర్థికం కాదు) వచ్చినా నాతో పంచుకునేవాడు. నేనూ పరిష్కరించేవాణ్ణి. బిజీగా ఉన్నప్పటికీ ఫోన్ చేసేవాడు. నేను చేయకపోతే ‘మర్చిపోయారా’ అని ఫోన్ చేసేవాడు.