రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం

14 Nov, 2019 06:24 IST|Sakshi

సాక్షి, విజయనగరం: సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యశాస్త్రి గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ 104వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 30న సమాఖ్య సభ్యులు పురస్కారం అందజేయనున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పీవీ నరసింహరాజు, కాపుగంటి ప్రకాష్‌లు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. సాయిఫౌండేషన్‌ అధ్యక్షుడు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పురస్కార ప్రదాతగా వ్యవహరిస్తారన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా