బిగ్‌బాస్‌: ప్రపోజ్‌ చేసిన కంటెస్టెంట్‌!

12 Aug, 2018 12:04 IST|Sakshi
యషికా

చెన్నై: తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ సామ్రాట్‌-తేజస్వీ, తనీష్‌-దీప్తి సునయనల బంధం స్నేహమా లేక అంతకు మించా అనే విషయం అర్థం కాలేదు. వాళ్లేమో స్నేహమే అంతకు మించి ఏమిలేదని చెబుతున్నారు. కానీ వారి ప్రవర్తన అలా అనిపించడం లేదు. ఇక తమిళ బిగ్‌బాస్‌లో యషికా-మెహతాల మధ్య బంధం మాత్రం ఈ రెండు జోడిలను మించింది. 

శుక్రవారం ఎపిసోడ్‌లో హౌస్‌కు అతిథులుగా వచ్చిన తొలి సీజన్‌ కంటెస్టెంట్స్‌ హరీష్‌ కల్యాణ్‌, రైజా విల్సన్‌లు వారి బంధంపై ఓ  క్లారిటీ తీసుకొచ్చారు. వారి డెబ్యూ చిత్రం ‘ప్యార్‌ ప్రేమా కాదల్‌’  ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ మాజీ కంటెస్టెంట్స్‌ హౌస్‌మేట్స్‌ను యషికా-మెహతాల బంధం స్నేహానికి మించి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా అని ప్రశ్నించారు. దీనికి కంటెస్టెంట్స్‌ అంతా అంగీకరించగా.. మెహతా మాత్రం తప్పుబట్టాడు. దీంతో ఒక్కసారిగా యషికా గుండె బద్దలైంది. ఆరోజంతా ఆమె ఏడుస్తూ బాధపడింది. ఇక ఈ వ్యవహారంపై హోస్ట్‌ కమల్‌ హాసన్‌ శనివారం ఆరాతీశాడు.

తొలుత మెహతాను ప్రశ్నించగా.. తనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని, తాను ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నానని తెలిపాడు. ఆమె బయట నాకోసం వేచిచూస్తోందని ఆమెను బాధపెట్టే పని తను చేయనని సమాధానమిచ్చాడు. ఇక 19 ఏళ్ల యషిక మాట్లాడుతూ.. 50 రోజులుగా కలిసి ఉండటంతో అతని ప్రేమలో పడిపోయానని, కానీ అతని పరిస్థితి అర్థం చేసుకున్నానని తెలిపింది. అతని పరిస్థితిని గౌరవిస్తానని, కానీ తన వైఖరిని మాత్రం మార్చుకోలేనని పేర్కొంది. ఆమె నిజాయితికి కమల్‌ మురిసిపోయి ప్రశంసించాడు. ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని సూచించాడు. ప్రస్తుతం ఈ టాపిక్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక గత సీజన్‌లో ఓవియా సైతం ఇలానే ప్రేమ వ్యవహారాలతో హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా