‘బాహుబలి’ రికార్డుకు చేరువలో ‘కేజీఎఫ్‌’

18 Jan, 2019 09:51 IST|Sakshi

తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పోలిస్తే సౌత్‌లో కన్నడ సినీ పరిశ్రమ చాలా చిన్నది. మార్కెట్ పరంగానూ కన్నడ సినిమా భారీ వసూళ్లు సాధించిన రికార్డ్‌ లేదు. ఇన్నాళ్లు తమ సినిమాలను ఇతర భాషల్లోకి అనువదించకపోవటం, ఇతర భాషా చిత్రాల అనువాదానికి అంగీకరించకపోవటం కారణంగా సాండల్‌వుడ్ మార్కెట్ పరంగా పెద్దగా ఎదగలేకపోయింది. అయితే ఈ హద్దులను చెరిపేసిన సినిమా కేజీఎఫ్‌.

యువ కథానాయకుడు యష్‌ హీరోగా తెరకెక్కిన ఈ పిరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్‌ అయ్యింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో కన్నడ నాట సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా గ్రాస్‌ సాధించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు కన్నడలో రూ. 121 కోట్లకు పైగా వసూళ్లు సాదించి వందకోట్ల మార్క్‌ దాటినతొలి కన్నడ చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది.

కర్ణాటకలో అత్యథిక వసూళ్లు సాధించిన రికార్డ్ బాహుబలి 2 పేరిట ఉంది. బాహుబలి సాండల్‌వుడ్‌లో 129 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ రికార్డ్‌ను అతి త్వరలో కేజీఎఫ్ బద్ధలు కొట్టనుంది. ఇ‍ప్పటికీ కేజీఎఫ్‌ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు సాధించే దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

సినిమా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!