మరో తెలుగు సినిమాలో దుల్కర్‌

27 Feb, 2019 13:43 IST|Sakshi

మళయాల యువ కథనాయుకు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిన దుల్కర్‌, మహానటితో స్ట్రయిట్‌ తెలుగులో సినిమా నటించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో దుల్కర్‌ను టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యువ నటుడు మరో తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మళయాల మెగాస్టార్‌ దుల్కర్‌ తండ్రి అయిన మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమాను తెరకెక్కించిన మహి వీ రాఘవ దర్శకత్వంలో దుల్కర్‌, తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహి చెప్పిన లైన్‌కు ఓకె చెప్పిన ఈ యంగ్‌ హీరో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు