సైరాబాను మనవరాలి తెరంగేట్రం..

11 Oct, 2014 05:05 IST|Sakshi
సైరాబాను మనవరాలి తెరంగేట్రం..

సైరాబాను మనవరాలు సయేషా త్వరలోనే తెరంగేట్రం చేయనుంది. అజయ్ దేవ్‌గణ్ తన సొంత సంస్థ ‘ఎఫ్ ఫిలిమ్స్ అండ్ ఎరోస్’ బ్యానర్‌పై రూపొందించనున్న యాక్షన్ చిత్రం ‘శివే’ కోసం సయేషాను ఎంపిక చేసుకున్నాడు. మరో విశేషమేమంటే... ఈ చిత్రానికి అజయ్ స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు. దర్శకుడిగా అజయ్‌కి ఇది రెండో చిత్రం. తన భార్య కాజోల్ కథానాయికగా 2008లో ‘యా, మీ ఔర్ హమ్’ చిత్రం తీశాడు. అది ఫ్లాప్ అయింది. దీంతో దర్శకత్వానికి దూరంగా ఉన్న అజయ్ దేవ్‌గణ్, ఇన్నాళ్ల వ్యవధి తర్వాత దర్శకత్వం చేపట్టేందుకు సిద్ధవువుతున్నాడు.