ప్రేమ..ప్రతీకారం

23 Mar, 2019 03:03 IST|Sakshi
లగడపాటి విక్రమ్‌ సహిదేవ్‌

లగడపాటి విక్రమ్‌ సహిదేవ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్‌ బ్రేవ్‌ హార్ట్‌’ అనేది ఉపశీర్షిక. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య –నా ఇల్లు ఇండియా’ సినిమాలో అన్వర్‌ పాత్రలో సహిదేవ్‌ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రానికి రఘు జయ దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీధర్‌ నిర్మించారు.

టైటిల్‌ను అనౌన్స్‌ చేసి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఎ స్టోరీ ఆఫ్‌ బ్రేవ్‌ హార్ట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ హీరో క్యారెక్టర్‌కు బాగా సూట్‌ అవుతుంది. కథకు తగ్గట్లు వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. సహిదేవ్‌కు మంచి పేరు వస్తుంది. సినిమాలో యాక్షన్‌తోపాటు అందమైన టీనేజ్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. న్యూ ఏజ్‌ రివేంజ్‌ డ్రామా కూడా. ఫస్ట్‌లుక్, టైటిల్‌కు రెస్పాన్స్‌ వస్తోంది. మా సంస్థలో ఓ మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు