సీతు పాప సింపుల్‌ యోగాసనాలు

21 Jun, 2020 11:51 IST|Sakshi

హైదరాబాద్‌: నేడు(జూన్‌ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆద్య, సితారలు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సులువైన యోగాసనాలు ఎలా వేయాలో వివరిస్తూ ఓ వీడియోను తమ ఏ అండ్‌ ఎస్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో  అప్‌లోడ్‌ చేశారు. సునాయసంగా వేసే యోగాసనాలతో పాటు, ఆ ఆసనాలతో కలిగే లాభాలను చక్కగా వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక వీరి ప్రయత్నానికి, డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ సూపర్బ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. (సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా)

ఇక మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరూ కలిసి ఏ అండ్‌ ఎస్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆటలు, విజ్ఞానం, వినోదానికి సంబంధించిన పలు వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తర్వాత మహేశ్, రష్మికలను ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు ఇంటర్వ్యూచేసి అకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తూ పలు వీడియోలను పోస్ట్‌ చేస్తుండటంతో ఏ అండ్‌​ ఎస్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు అభిమానుల‌ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు