12న యువ హీరో పెళ్లి

4 Feb, 2016 21:07 IST|Sakshi
12న యువ హీరో పెళ్లి

 తమిళసినిమా: యువ నటుడు, డాక్టర్ అయిన టీఎస్.సేతురామన్ ఓ ఇంటివాడు కానున్నారు.యాక్టర్ అయిన డాక్టర్ ఈయన. ఎంబీబీఎస్, ఎండీ పట్టభద్రుడైన సేతురామన్ నటుడు సంతానంతో కలిసి కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు.ఈయన సంతానంకు మంచి మిత్రుడన్నది గమనార్హం. వాలిభరాజా చిత్రంలో సోలో హీరోగా నటించిన సేతురామన్ తూత్తుకుడికి చెందిన ఉమైయళ్ అనే ఇంజినీరింగ్ యువతిని వివాహమాడనున్నారు.

వీరి పెళ్లి ఈ నెల 12న తూత్తుకుడి సమీపంలోని పుదువయల్ గ్రామంలో జరగనుంది. వివాహ రిసెప్షన్ 21వ తేదీన చెన్నై,రాజాఅన్నామలైపురంలోని రామనాథన్ శెట్టియార్ హాలులో నిర్వహించనున్నట్లు, ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సేతురామన్ వెల్లడించారు. అదే విధంగా మార్చిలో స్థానిక రాయపేటలోని పోయెస్ గార్డెన్‌లో ఒక క్లినిక్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.