కార్తీక్ సుబ్బరాజ్‌పై నిర్మాతల గుర్రు

8 Jun, 2016 08:22 IST|Sakshi
కార్తీక్ సుబ్బరాజ్‌పై నిర్మాతల గుర్రు

యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌పై తమిళ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. ఆయనపై రెడ్‌కార్డ్ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. పిజ్జా, జిగరతండా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్. ఈయ న ఆది నుంచి వివాదాలను ఎదుర్కొంటున్నారు. జిగర్‌తండా చిత్రం నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాతతో భేదాభిప్రాయాలు సంచలనం కలిగించాయి. తాజాగా ఇరైవి చిత్రంతో మరో సారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. విజయ్‌సేతుపతి, ఎస్‌జే.సూర్య, బాబీ సింహ, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరై వి.

కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా, సీవీ.కుమార్ నిర్మిం చారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఇరైవి చిత్ర రిజల్ట్ ఎలా ఉందన్నది పక్కన పెడితే ఇందులోని కొన్ని సన్నివేశాలు తమిళ నిర్మాతలను అవమాన పరచేవిగా ఉన్నాయంటూ పలు నిర్మాతలు ధ్వజమెత్తుతున్నారు. నిర్మాత సురేశ్‌కామాక్షి, పిఎల్.తేనప్పన్ వంటి నిర్మాతలు కార్తీక్‌సుబ్బరాజ్‌కు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.

నిర్మాత ఈగో కారణంగా చిత్ర నిర్మాణం నిలిచిపోయిందనే సన్నివేశాలతో సినీ నిర్మాతలను అవమాన పరిచేవిధంగా ఇరైవి చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయని,ఈ చిత్ర నిర్మాతలు జ్ఞానవేల్‌రాజా, సీవీ.కుమార్ కథ తెలియకుండా ఇరైవి చిత్రాన్ని నిర్మించి ఉండరని, అందువల్ల ఈ విషయంలో వారిని కూడా ప్రశ్నించాలని తమిళ నిర్మాతల మండలిపై ఒత్తిడి పెరుగుతోంది.  సోమవారం తమిళ నిర్మాతల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇరైవి చిత్ర వివాదం గురించి చర్చించారు.  

సమావేశంలో పలువురు నిర్మాతలు కార్తీక్‌సుబ్బరాజ్‌పై రెడ్‌కార్డ్ వేయాలని డిమాండ్ చేశారు.అ యితే ఒక దర్శకుడిపై నిర్మాతల మండలి రెడ్ కార్డ్ వేయలేదని,ఈ అంశాన్ని దర్శకుల సంఘానికి వదిలిపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో కార్తీక్‌సుబ్బరాజ్ వివా దం దర్శకుల సంఘం కోర్డుకు చేరినట్లు తెలిసింది. ఆ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.