మూడు సినిమాలు ఒప్పేసుకున్నాడు

16 Aug, 2016 10:54 IST|Sakshi
మూడు సినిమాలు ఒప్పేసుకున్నాడు

ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మధ్యలో కెరీర్ కాస్త తడబడినట్టు కనిపించినా.. ఆడోరకం ఈడో రకం సినిమాతో తిరిగి ట్రాక్లోకి వచ్చాడు. ప్రస్తుతం మీడియం బడ్జెట్తో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు రాజ్ తరుణ్ బెస్ట్ ఛాయిస్గా మారాడు. కామెడీ టైమింగ్తో పాటు డిఫరెంట్ డైలాగ్ డెలివరీ రాజ్ తరుణ్కు ప్లస్ అయ్యంది.

అదే బాటలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలకు అంగకీరించాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఇదే బ్యానర్లో దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో రాజుగాడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సంజనా రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు సంబందించిన కథా చర్చల్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు వెలిగొండ శ్రీనివాస్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్లోనూ రాజ్ తరుణ్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూడు సినిమాలను మూడు, నాలుగు నెలల గ్యాప్తో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి