లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘#బాయ్స్‌’

31 Aug, 2019 16:05 IST|Sakshi

శ్రీపిక్చర్స్ బ్యాన‌ర్‌పై నేహాశ‌ర్మ నిర్మాత‌గా కొత్త చిత్రం ‘#బాయ్స్’ ఈరోజు ప్రారంభ‌మైంది. ‘ర‌థం’ ఫేమ్ గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్ రెడ్డి, సుజిత్‌, అన్షులా, జెన్నీఫ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంజ‌య్ స్వరూప్‌, మేల్కొటి, ఉత్తేజ్ ప్రధాన పాత్రధారులుగా న‌టిస్తున్నారు. ద‌యానంద్ ద‌ర్శకుడు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కె.ఎల్‌.దామోద‌ర్ ప్రసాద్ క్లాప్ కొట్టి, డైరెక్టర్‌కి స్క్రిప్ట్‌ను అందించారు.

‘ర‌థం’ డైరెక్టర్ రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సుప్రియ‌, నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా పూజా కార్యక్రమాల్లో పాల్గొని యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా... 
ద‌ర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ - ‘ఇది ద‌ర్శకుడిగా నా తొలిచిత్రం. న్యూ ఏజ్ యూత్‌ఫుల్ ల‌వ్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి టీమ్ కుదిరింది. క‌థ న‌చ్చగానే నిర్మాత‌లు వెంట‌నే సినిమాను చేయ‌డానికి అంగీక‌రించారు. వారికి నా థ్యాంక్స్’ అన్నారు.

నిర్మాత నేహాశ‌ర్మ మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ యూత్‌ఫుల్  ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మా బాయ్స్ సినిమాను రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. టాకీ పార్ట్ అంతా హైద‌రాబాద్‌లో ఉంటుంది. గోవాలో పాటల‌ను చిత్రీక‌రిస్తాం. సెప్టెంబ‌ర్ 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా