యూట్యూబ్‌ సెలబ్స్‌

4 Oct, 2019 12:05 IST|Sakshi
గౌతమి చిత్ర , హారిక అలేఖ్య

దేత్తడి’తో హారిక అలేఖ్య..

నవ్వులతో రచ్చ చేస్తున్న గౌతమి చిత్ర

పొట్టి వీడియోస్‌కు మిలియన్‌ వ్యూస్‌

స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న సిటీ యువతులు

ఉన్నత చదువులు చదివి కార్పొరేట్‌ కొలువులు దక్కించుకుని హ్యాపీ లైఫ్‌ గడిపేద్దామనే ఆలోచనలు ఆధునిక అమ్మాయిలవి కాదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా కాలపు యువతులవి అసలే కావు. వీటన్నింటికీ మించి ఏదో సాధించాలి. నలుగురినీ  మెప్పించడంతో పాటు ప్రతిభతో తమకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు ఉండాలి. వైవిధ్యభరిత విజయాలు లిఖించాలి అని ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. వాటి సాధన కోసం కృషి చేసి సాధిస్తున్నారు కూడా. తమ ఆశయాల ఆలోచనలను నిజం చేసుకునేందుకు సోషల్‌ మీడియానే వేదికవుతోంది.

సాక్షి, సిటీబ్యూరో: ఒకరు తెలంగాణ అమ్మాయి హారిక అలేఖ్య. మరొకరు అనంతపూరం వాసి గౌతమిచిత్ర. వీరిద్దరూ వేర్వేరు వెబ్‌ సిరీస్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిది నిమిషాల నిడివి గల వీడియోస్‌ను రూపొందించి సోషల్‌ మీడియాలో వదులుతుంటే వాటికి వ్యూవర్స్‌ నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. అగ్ర కథానాయకులకు సైతం సాధ్యం గాని లక్షల వ్యూస్‌ వీరిద్దరి వీడియోస్‌కు రావాడం గమనార్హం. ఖాళీ సమయంలో సరదా కావాలన్నా.. ఒత్తిడిని దూరం చేయాలన్నా వీరి వీడియోస్‌ చూస్తే చాలు.. కావాల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. వారి డైలాగ్‌లకు కడుపుబ్బా నవ్వుకోవాల్సిదే.  

విభిన్న ఆలోచనలతో..
హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్యకి చిన్నప్పటి నుంచి రేడియో జాకీ అవ్వాలనేది కోరిక. గౌతమి చిత్రకు మంచి ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష. బీబీఏ పూర్తి చేసి అమెజాన్‌లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది హారిక. ఎంసీఏ పూర్తి చేసి ఓ ఉన్నతమైన ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో గౌతమి చిత్ర అనుకోకుండా ఓ వీడియోలో కనిపించింది. హారిక ‘చిత్ర విచిత్రం’తో నెటిజన్లకు పరిచయమైతే.. గౌతమి చిత్ర ‘లాఫింగ్‌టైమ్‌’తో యూట్యూబ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం ఏడాదిన్నర్రలో వీరిద్దరూ అనూహ్య క్రేజ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. చదువు.. ఉద్యోగం వంటివే ప్రధానమనుకునే కుటుంబాల్లో సోషల్‌ మీడియా వైపు అడుగులు వేస్తున్నారంటే వ్యతిరేకత వస్తుంది. కానీ హారికకు ఫ్యామిలీ ఫుల్‌ సపోర్ట్‌నిచ్చింది. గౌతమి చిత్రకి ఫ్యామిలీ సపోర్ట్‌ లేకపోయినా సిటీకి వచ్చి సెటిలై నేడు లక్షలాది మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకోగలిగింది.  

ఒత్తిడి పరార్‌
ఐటీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, ఇంట్లో ఉండేవారు.. ఏ వర్గానికి చెందినవారైనా ఒత్తిడికి గురైతే వీరిద్దరి వీడియోలనే చూడడం విశేషం. హారిక అలేఖ్య నటించిన ‘హుషార్‌ పిల్ల, బేరమాడితే, కళాశాల, ఫస్ట్రేటెడ్‌ తెలంగాణ పిల్ల, ఎంబీబీఎస్‌ స్టూడెంట్, సర్పంచ్, లేడీడాన్‌’ వంటి వాటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చెబుతున్న డైలాగ్స్‌కి, నవ్విస్తున్న తీరుకు ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వుకోవడం విశేషం. ఇక గౌతమి చిత్ర విషయానికొస్తే..‘ఫన్‌బకెట్‌’లో హేమంత్‌కు టీచర్‌గా, ‘పెళ్లాం వంట–గుండెల్లో మంట, రిలేటివ్స్‌ ఇంటికెళ్తే, ది లేట్‌ కామర్, అటు క్లాస్‌..ఇటు మాస్, సమంత పెళ్లిచూపులు’ వంటి ఎన్నో వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్‌ సొంతం చేసుకుంది. భార్యగా నటించాలన్నా.. గయ్యాళిగా మెప్పించాలన్నా.. ఇన్నోసెంట్‌గా మార్కులు పడాలన్నా గౌతమి చిత్రనే బెస్ట్‌ అనే స్థాయికి చేరుకుంది.  

లక్షల్లో సబ్‌స్క్రైబర్స్‌
వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నయూట్యూబ్‌ చానల్స్‌కి లక్షల్లో సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. హారిక ప్రాతినిధ్యం వహిస్తున్న‘దేత్తడి’ చానల్‌ ఏడాదిన్నరలో పదిలక్షల బ్‌స్క్రైబర్స్‌ని చేరుకోబోతుంది.గౌతమిచిత్ర ప్రాతినిధ్యం వహిస్తున్నచానల్‌కు ఐదు లక్షల సబ్‌స్రైబర్స్‌ ఉన్నారు.సినీరంగాన్ని ఏలుతున్న తారలుసమంత, రకుల్‌ ప్రీత్‌సింగ్, శృతిహాసన్‌వంటి వారు నటించిన వీడియోస్‌ సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానల్స్‌లో ఐదు నుంచి పది లక్షలు వ్యూస్‌ ఉంటున్నాయి. హారిక, గౌతమి తమ పొట్టి వీడియోలతోఏడాదిన్నరలోనే ముప్పై, నలబై లక్షల వ్యూస్‌ సొంతం చేసుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఉన్న క్రేజ్‌ ఏంటనేది స్పెషల్‌గాచెప్పక్కర్లేదు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు