కార్తికేయను మించి ఆదరించాలి

3 Mar, 2020 00:42 IST|Sakshi
టీజీ విశ్వప్రసాద్, అభిషేక్, చందు, అభినయ రెడ్డి, నిఖిల్, కరుణాకర్‌ రెడ్డి

– భూమన కరుణాకర్‌ రెడ్డి

‘‘శ్రీకృష్ణుని చుట్టూ అల్లుకున్న కథాంశంతో ‘కార్తికేయ 2’ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్‌ చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. ‘కార్తికేయ’ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఆదించారో అంతకు మించి ‘కార్తికేయ 2’ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి. నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ సినిమా తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో సోమవారం ప్రారంభమైంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

భూమన కరుణాకర్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఆయన తనయడు అభినయ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. నిఖిల్‌ మాట్లాడుతూ– ‘‘భారతీయ సంప్రదాయాలను ‘కార్తికేయ 2’లో అద్భుతంగా చూపెట్టనున్నాం. ఉగాది తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘తాజాగా విడుదల చేసిన ‘కార్తికేయ 2’ టైటిల్‌ లోగో, కాన్సెప్ట్‌ వీడియోకి మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. ఈ సీక్వెల్‌ కచ్చితంగా ప్రేక్షకులకు ప్రత్యేకమైన థ్రిల్‌ ఇస్తుంది’’ అన్నారు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, చందు మొండేటి, సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా