రాఖీ పండుగకి నాగ్‌ గిఫ్ట్‌ ఇదే..

7 Aug, 2017 15:01 IST|Sakshi

హైదరాబాద్‌:   అక్కినేని యంగ్‌ హీరో నాగ  చైతన్య రాఖీ పర‍్వదిన్నాన్ని పురస్కరించుకొని  అభిమానులకు మంచి గిఫ్ట్‌ అందించారు. తన రాబొయే చిత్రం  `యుద్ధం శ‌ర‌ణం` సినిమాలోని ఓ పాట‌ను రాఖీ బ‌హుమ‌తిగా అభిమానుల‌కు నాగ‌చైత‌న్య అంద‌జేశారు.  ఈ సినిమాలోని `ఎన్నో ఎన్నో భావాలే` అనే పాట లిరిక‌ల్ వీడియోను నాగచైత‌న్య ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు ఈ పాట‌ను ద‌ర్శ‌కుడు కృష్ణ వైర‌ముత్తుతో క‌లిసి రేడియో మిర్చిలో విడుద‌ల చేసిన‌ట్లు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అంటూ  సీనియర్‌  నటి రేవతి డైలాగ్‌.... నాగ‌చైత‌న్య‌కు రాఖీ క‌డుతున్న స‌న్నివేశంతోనే ఈ వీడియో మొద‌ల‌వుతోంది. అలాగే  హీరోయిన్‌ లావ‌ణ్య త్రిపాఠికి, నాగ‌చైత‌న్య‌కు మ‌ధ్య ఉన్న కొన్ని చ‌క్క‌ని స‌న్నివేశాల‌ను కూడా ఈ వీడియోలోలో పొందుపరిచారు. కుటుంబ బంధాల‌ను, వారితో గడిపిన సంతోష క్ష‌ణాల‌ను ఈ వీడియోలో  చూడొచ్చు.
కాగా  హీరో, నటుడు  శ్రీకాంత్‌ విలన్‌ పాత్రను  పోషిస్తుండగా, నాగ‌చైత‌న్య త‌ల్లిదండ్రులుగా రావుర‌మేశ్‌, రేవ‌తిలు న‌టించారు. వివేక్‌సాగర్‌ సంగీతం అదించిన సంగతి తెలిసిందే.
 సంగతి తెలిసిందే.
 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా