అప్సర... అదరహో!

10 Apr, 2017 00:31 IST|Sakshi
అప్సర... అదరహో!

అప్సరసలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరు? అని పోటీ పెడితే... కచ్చితంగా అమల, ఖుష్బూ, నదియా పేర్లు ఆ జాబితాలో ఉంటాయి. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఈ అప్సరసలు ఈ ఏజ్‌లోనూ తరగని అందంతో తళుకులీనుతున్నారు. ఈ అందాల తారలందరూ ఒకచోట కలిశారు. వీళ్లతో పాటు కొత్త తరం కథానాయికలూ కనువిందు చేశారు.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ‘జీ’ నిర్వహించిన ‘జీ అప్సర అవార్డ్స్‌–2017’ వేడుకల్లో వీళ్లంతా సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మరి, హీరోల సంగతేంటి? వాళ్లూ ఉన్నారండోయ్‌! స్టార్‌ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన తారలు... ఇంకా పలువురు సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నారు. పలు రంగాల్లో ప్రతిభ చూపి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మహిళలకు ఈ అవార్డు వేడుకల్లో పురస్కారాలు అందించారు.