లఘుచిత్ర ‘చందనం’

8 Mar, 2019 10:49 IST|Sakshi

సాక్షి, నల్లగొండ టౌన్‌ : ఎటువంటి శిక్షణ లేకుండానే షార్ట్‌ఫిల్మ్‌ల నిర్మాణంతో పాటు దర్శకత్వం వహిస్తూ లఘుచిత్ర రంగంలో  రాణిస్తున్నారు చందన. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పనస శంకరయ్య, లింగమ్మ చివరి సంతానం చందన. ఎంసీఏని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తన తండ్రి రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి శంకరయ్య  2016లో మరణించారు.

ఆయన  ప్రథమ వర్ధంతి సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని  తెలియజేసే ఇతివృత్తంతో నేను–నాన్న అనే లఘుచిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఆ లఘుచిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. అదే స్ఫూర్తితో తర్వాత భ్రూణహత్య(సేవ్‌గర్ల్‌) లఘుచిత్రాన్ని నిర్మించారు. ఆ లఘుచిత్రానికి అవణి క్రియేషన్స్‌ సంస్థ ఉత్తమ మహిళా దర్శకురాలు అవా ర్డుతో రవీంద్రభారతిలో సత్కరించారు. తర్వాత బంగారుతల్లి,  గత సంవత్సరం బతుకమ్మ అనే లఘుచిత్రాలను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో పక్క లఘుచిత్రాలను నిర్మిస్తూ అందరి మన్ననలు పొం దుతున్నారు.

సినిమాలపై ఉన్న ఆసక్తితో 
చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో లఘుచిత్రాల నిర్మాణం, దర్శకత్వ రంగంపై మక్కువ పెంచుకున్నాను. నేను–నాన్న లఘుచిత్రానికి విశేష ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో యువతకు సందేశాలను ఇచ్చే ఇతివృత్తాలతో లఘుచిత్రాలను నిర్మిస్తా.     –  చందన    

మరిన్ని వార్తలు