రేషన్‌ దుకాణాల్లో విస్తృత తనిఖీలు

12 Jan, 2018 11:58 IST|Sakshi

డీఎస్‌ఓ ఆధ్వర్యంలో ఆరుగురు డీటీల సోదాలు

అనుమతి లేకుండా వంటనూనెల ఏజెన్సీలు

నల్లగొండ : రేషన్‌ దుకాణాల్లో సివిల్‌ సప్లయీస్‌ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పండుగ సీజన్‌ కావడంతో దుకాణాల్లో బియ్యం పంపిణీ సక్రమంగా చేయడం లేదని స్థానికులు సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డైరక్టరేట్‌నుంచి ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం డీఎస్‌ఓ ఆధ్వర్యంలో ఆరుగురు డీటీలు నల్లగొండ పట్టణంలోని ఏడు రేషన్‌ దుకాణాలు, ఒక ఆయిల్‌ ఏజెన్సీని తనిఖీ చేశారు. అనుమతి లేకుండా బొట్టుగూడలో వం టనూనెల ఏజెన్సీ నిర్వహిస్తున్న దుకాణాన్ని డీఎస్‌ఓ సీజ్‌ చేశారు. దుకాణంలోని రూ.3.28 లక్షల విలువ చేసే స్టాక్‌ను సీజ్‌ చేశారు. లైసెన్స్‌ లేకుండా ఏజెన్సీ ఏర్పాటు చేసినందున 6 ఏ కింద కేసు నమోదు చేశారు. దేవరకొండ, బొట్టుగూడలోని రేషన్‌ దుకాణాలు తనిఖీ చేసిన అధి కారులు బియ్యం నిల్వలో స్వల్ప తేడాలు ఉన్న ట్లు గుర్తించారు. రెండు దుకాణాల్లో బియ్యం నిల్వలు తేడాల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో వాటిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు రిపోర్ట్‌ రాశారు. ఈ తనిఖీల్లో డీఎస్‌ఓ ఉదయ్‌ కుమార్, డీటీలు సత్యనారాయణ, రఘు, స యీద్, సంఘమిత్ర, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు