రోజూ మాత్ర

2 Jan, 2018 09:15 IST|Sakshi

టీబీ వ్యాధికి అడ్డుకట్ట 

మూడు రోజుల పద్ధతికి స్వస్తి

ఇకనుంచి ప్రతిరోజూ మందుల సరఫరా

నూతన విధానంపై సిబ్బందికి శిక్షణ

వ్యాధిగ్రస్తుల బరువును బట్టి డోస్‌

టీబీ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా క్షయ నివారణ శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రోగులకు వారానికి మూడు రోజులపాటు (సోమ, బుధ, శుక్రవారాలు) మాత్రలు ఇచ్చేవారు. దీనికి స్వస్తిచెప్పి..ఇకనుంచి రోజూ మాత్రలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్టులు, సూపర్‌వైజర్లు, ఆశవర్కర్లకు శిక్షణ ఇచ్చారు. 

నల్లగొండ టౌన్‌ : టీబీ వ్యాధికి అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్సిడ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌టీసీ) మందుల కంపెనీ విధానంలో మార్పులు చేశాయి. గతంలో వారానికి మూడు రోజులే వ్యాధిగ్రస్తులకు మందులిస్తుండగా ఇక నుంచి వ్యాధిగ్రస్తుల బరువును బట్టి మందులను అందించే విధానికి శ్రీకారం చుట్టింది. ఈ విధా నం ఇప్పటికే జిల్లా క్షయనివారణ శాఖ అమల్లో పెట్టింది. నూతన విధానం అమల్లోకి రావడం పట్ల జిల్లాలోని 1327 మంది టీబీ వ్యాధిగ్రస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలో పలు లోపాలున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నూతన విధానంపై అమలుకు మొగ్గు చూపింది. రోగి బరువును రోజుకు రెండు మాత్రల నుంచి 5మాత్రలు వేసుకునేలా అందజేస్తున్నారు.

 70కిలోల బరువు కలిగిన రోగికి ఒకరోజు 5మాత్రలు, వారానికి 5మాత్రలు వేసుకోవాల్సి వుంటుందని, గతంలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వాధిగ్రస్తులకు మాత్రలను ఇచ్చేవారు. లేకుంటే వైద్యారోగ్యశాఖ సిబ్బంది గుర్తించిన వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి మాత్రలను సరఫరా చేసేవారు. మాత్రలను వేసుకోవడంలో ఏఒక్క రోజు మరిచిపోయిన మందుల కోర్సు ను మళ్లీ వేసుకోవాల్సి వుండేది. దీని కారణంగా వ్యాదిగ్రస్తుల సంఖ్య తగ్గకపోగా ఏటేటా కొత్త వ్యాధిగ్రస్తులను గుర్తించాల్సివచ్చేది. ప్రస్తుతం నూతన విధానం వలన వ్యాధిగ్రస్తులు మాత్రలను వేసుకోవడం మరిచిపోయే అవకాశం ఉండదు. నూతన విధానం వలన జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. 

సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ 
టీబీ మందుల సరఫరా విధానంలో నూతనంగా అమలు చేస్తున్న పద్ధతిపై జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏ ఎన్‌ఎంలు, ఫార్మసిస్టులు, సూపర్‌వైజ ర్లు, ఆశవర్కర్లకు శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీపై అవగాహన కల్పిం చడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందుల పంపిణీ చేస్తున్నారు. 

వాధ్యిగ్రస్తులకు  లాభం 
నూతన విధానం వలన వ్యాధిగ్రస్తులు మందులను వేసుకోవడం మరిచిపోయే అవకాశం ఉండదు. ఈ విధానం వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. మందులను అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అందుబాటులో ఉంచడడం జరిగింది. అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకుని వ్యాధి నుంచి విముక్తులు కావాలి.
– డాక్టర్‌ అరుంధతి, 
జిల్లా క్షయ నివారాణాధికారి 

Read latest Nalgonda News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు