ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు : మంత్రి

30 Aug, 2019 20:37 IST|Sakshi

సాక్షి, నల్గొండ: సుపరిపాలన ప్రజల చెంతకు చేరాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా ఘట్టుప్పల్‌లో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘట్టుప్పల్‌ను కొత్త మండలం చేయాలనే డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, అలాగే గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ఘట్టుప్పల్ మండల సాధన కోసం ఆత్మహత్యయత్నం చేసి తీవ్రంగా గాయపడిన యువకుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఘట్టుప్పల్ మండల సాధనలో భాగంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు

Read latest Nalgonda News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు