24గంటల కరెంట్‌తో లాభం లేదు

2 Jan, 2018 09:28 IST|Sakshi

భువనగిరిటౌన్‌ : ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్‌తో భూస్వాములకు తప్ప రైతులకు  లాభం లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు. సోమవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఆర్భాటాలు, ప్రచారాలు చేయడం తప్ప అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందన్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు మోసపోయారన్నారు. నాలుగు సంవత్సరాలు అవుతున్నా నిమ్స్‌ పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులతో కుమ్మక్కయ్యారన్నారు. 

నిమ్స్‌ ఆస్పత్రిపై వివక్ష చూపుతున్నారని అలాంటి చర్యలు మానుకుని నిధులు కేటా యించాలన్నారు. నయీమ్‌ కేసులు ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు చెప్పడానికి ప్రతిపక్ష ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వ డం లేదన్నారు. రాష్ట్రం లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారన్నారు. అనంతరం నూతన సంవత్సరం పురస్కరించుకుని రహదారి బంగ్లాలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చౌటుప్పుల్‌ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పంజాల  రామాంజనేయులు, బెండ లాల్‌రాజ్, బర్రె జహంగీర్, యాట నాగరాజు, భువనగిరి వెంకటరమణ, పి.శ్యాంగౌడ్, బి.భాస్కర్‌రెడ్డి, ఈరపాక నర్సింహ, ముల్తానీషా, బర్రె నరేష్, అందె నరేష్, మహ్మద్‌ సలావుద్దీన్, పడిగెల ప్రదీప్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు