భూ తగాదాలో వృద్ధుడి హత్య

17 Jan, 2018 11:06 IST|Sakshi

మోతె ( కోదాడ ) :  భూ తగాదాలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని హుస్సేన్‌బాద్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాటెపెల్లి వెంకటయ్య(65) అదే గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మయ్యకు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. వెంకటయ్య సోమవారం  తన వ్యవసాయ పొలంలో వరాలు చెక్కుతుండగా అదే గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మయ్య గొడ్డలితో కాళ్లు చేతులు నరికి చంపాడు.  వెంకటయ్య తన భూమిలోకి వెళ్లేందుకు దారి లేదు. లక్ష్మయ్య కుండబడిన పోరంబోకు భూమి నుంచి మాత్రమే వెళ్లాలి. నాలుగు సంవత్సరాల క్రితం లక్ష్మయ్య తన వ్యవసాయ భూమిలో నుంచి వెంకటయ్య వెళ్లకుండా దారి పూడ్చినాడు.

ఇరువురు పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం మేరకు లక్ష్మయ్య కుండబడిన 14 కుంటలు(సర్వే నెం–తెలియదు),20 కుంటల(సర్వేనెం–తెలియదు) పోరంబోకు భూమిని సుమారుగా రూ 3 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇట్టి భూమి విషయంలో రెండు కుటుంబాలకు అనేక సార్లు గొడవలు జరిగాయి.ఇరువురు పెద్దమనుష్యుల సమక్షంలో ఎలాంటి గొడవలకు పాల్పడమని ఒకరికొకరు ఒప్పందమైనారు.ఇటివల గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న భూప్రక్షాళన సర్వేలో ఇరువురు దరకాస్తు చేసుకున్నారు.రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఒకరికొకరు ఘర్షణకు దిగారు. 25 రోజుల క్రితం కొమ్ము రమేష్‌ మృతుడి కుమారుడు కాటెపెల్లి సైదులుపై గొడ్డలితో దాడిచేసి గాయపరిచాడు. కొంత కాలం నుంచి లక్ష్మయ్య వెంకటయ్య కుటుంబంతో గొడవ పడుతూ.. నా భూమి నాకు కావాలని బెదించాడు.వెంకటయ్య కుటుంబం లక్ష్మయ్య మాటలు పట్టించుకోకపోవడంతో లక్ష్మయ్య సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి వెంకటయ్యను గొడ్డలితో నరికి హాత్యచేసి పారిపోయాడు.గాయాలతో పొలంలో పడి ఉన్న వెంకటయ్యను 108 సహాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

కుటుంబానికి న్యాయం చేస్తాం
సూర్యాపేట నుంచి వెంకటయ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో వచ్చి మోతె పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.  హత్య చేసిన లక్ష్మయ్యను వెంటనే అరెస్టు చేసి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  పోలీసుల సమాచారంతో కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, సూర్యాపేట సీఐ ప్రవీణకుమార్, మునగాల సీఐ శివశంకర్‌ పోలీస్‌ బందోబస్తులతో మోతె పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మృతుడి కుమారుడు కాటెపెల్లి సైదులు ఫిర్యాదు మేరకు మునగాల  సీఐ శివశంకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు