జస్టిస్ రమణ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రధాని హాజరు

16 Feb, 2015 00:30 IST|Sakshi
జస్టిస్ రమణ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రధాని హాజరు
  • సీజేఐ, అద్వానీ తదితర ప్రముఖులు కూడా..
  • సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కుమార్తె వివాహ రిసెప్షన్ ఆదివారం రాత్రి ఇక్కడ ఆయన నివాసంలో జరిగింది. ఈ వేడుకకు ప్రధాని మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సహా ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, కేంద్ర మంత్రివర్గంలోని దాదాపు 15 మంది మంత్రులు, పలువురు సుప్రీం కోర్టు జడ్జిలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, పలు రాష్ట్రాల మంత్రులు, ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ఈ వేడుకకు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు