2100 నాటికి 1,100 కోట్లకు ప్రపంచ జనాభా

20 Sep, 2014 02:28 IST|Sakshi

వాషింగ్టన్: 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1,100 కోట్లకు చేరుతుందట. అయితే జనాభా పెరుగుదల అంశం.. పేదరికం, వాతావరణ మార్పులు, అంటువ్యాధుల వ్యాప్తి అనేక అంతర్జాతీయ సమస్యలకు కారణం కానుందట. ఐక్యరాజ్యసమితి, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఆధునిక గణాంక సాధనాలను ఉపయోగించి జరిపిన సర్వేలో 2100 నాటికి ప్రపంచ జనాభా 960 కోట్ల నుంచి 1,230 కోట్ల మధ్య ఉండేందుకు 80 శాతం సంభావ్యత ఉందని తేలింది. గతంలో అంచనా కంటే ఇది 200 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం 700 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని, అక్కడి నుంచి తగ్గుదల నమోదవచ్చని తెలిపింది.
 

మరిన్ని వార్తలు