ఎనిమిది నెలల్లో 1.5 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు

6 Jan, 2017 03:30 IST|Sakshi

చెన్నై: ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకం కింద కేవలం 8 నెలల కాలంలోనే కేంద్రప్రభుత్వం 1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు జారీచేసింది. ప్రస్తుతం ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు కేంద్రప్రభుత్వం డిపాజిట్‌ రహిత ఎల్పీజీ కనెక్షన్ కు రూ.1,600 ఆర్థికసాయం అందిస్తోంది. ఈ పథకం కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.8000 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో పథకాన్ని మరింత విస్తృతస్థాయిలో అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. అత్యధికంగా యూపీలో 46 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్‌(19లక్షలు), బిహార్‌(19లక్షలు), మధ్యప్రదేశ్‌(17లక్షలు), రాజస్థాన్ (14లక్షలు) ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు