దేశంలో 10 లక్షలటీచర్ల పోస్టులు ఖాళీ

31 Jul, 2018 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలకు సంబంధించి 10 లక్షలకు పైగా టీచర్లపోస్టులు మంజూరైనా అవన్నీ ఇంకా ఖాళీగానే ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఎలిమెంటరీ పోస్టుల్లో రాష్ట్రాలవారీ ఖాళీలను చూస్తే ఉత్తరప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంది. సెకండరీ లెవల్‌లో ఖాళీల విషయంలో జమ్మూ కశ్మీర్‌ తొలిస్థానంలో ఉంది. గత మార్చి31నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎలిమెంటరీ లెవల్‌లో 51,03,539 పోస్టులు మంజూరుకాగా ఇంకా 9,00,316 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహ లోక్‌సభలో చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో సెకండరీ లెవల్‌లో 25,657 పోస్టులు మంజూరుకాగా ఏకంగా 21,221 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

మరిన్ని వార్తలు