మృత్యువు నుంచి తండ్రిని రక్షించుకొంది

13 Apr, 2016 13:01 IST|Sakshi
మృత్యువు నుంచి తండ్రిని రక్షించుకొంది

కోల్కతా: కన్న తండ్రి కళ్ల ఎదుటే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 10 ఏళ్ల చిన్నారి ఉంది. సరిగ్గా ఓ రోజు మెట్రో స్టేషన్లో తాను చూసి అడ్వర్టైస్ మెంట్ గుర్తుకు వచ్చింది. వెంటనే అంత గాభరాలోనూ ఏడుస్తూ ఫోన్ తీసుకొని 100కు డయల్ చేసింది. తన తండ్రి ప్రాణాలకు కాపాడుకోగలిగింది.

వివరాలు..కోల్కతాలోని దక్షిణ సింథీలో నివాసముంటున్న 37 ఏళ్ల వ్యాపారి రాజీవ్ కన్నా తన భార్య షికాతో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి 10 ఏళ్ల కుమార్తె రషి ఉంది. సరిగ్గా రషి స్కూల్కు బయలు దేరే సమయంలోనే ఇంట్లో గొడవ ప్రారంభమైంది. ఓ వైపు తండ్రి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానిక ప్రయత్నిస్తుంటే, తల్లి ఏడుస్తూ కుప్పకూలింది. మా నాన్నను ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు, దయచేసి కాపాడండి అంటూ...అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 100కు ఫోన్చేసింది.

'మేం ముందుగా ఒక ప్రాంక్ కాల్ అనుకున్నాము. కానీ అమ్మాయి బిగ్గరగా ఏడుస్తూ మాట్లాడింది. తన తండ్రి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాడని' ఆ బాలికి తెలిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆ బాలిక చెప్పిన ఆడ్రస్కు వెంటనే బయలుదేరి వెళ్లి కాలినగాయాలతో కిచెన్లో పడి ఉన్న అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబకలహాల వల్లే కన్నా ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

'మా కళ్లెదుటే రాజీవ్ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మేము షాక్కు గురయ్యాము. నా కూతురు ఎంతో సమయ స్పూర్తితో పోలీసులకు సమాచారం ఇచ్చింది' అని రషి తల్లి షికా తెలింది.

మరిన్ని వార్తలు