నాలుగేళ్ల నుంచి చెత్త అలవాటు

25 Jul, 2016 15:20 IST|Sakshi
నాలుగేళ్ల నుంచి చెత్త అలవాటు

ధన్బాద్: నాలుగేళ్ల బాలుడికి ఓ వింత అలవాటు అయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్లు అవాక్కయ్యేలా అతడు కుక్కపాలు తాగడం మొదలుపెట్టాడు. ఆ పనికి పూర్తిగా బానిసలా మారాడు. పేదవారైన అతడి తల్లిదండ్రులు ఆ చెత్త అలవాటును ఎలా మాన్పించాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ధన్ బాద్ లో ఓ పేద తల్లిదండ్రులకు మోహిత్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి తల్లి రెండేళ్లకు పాలు మాన్పించింది.

కానీ, అనూహ్యంగా అతడు నాలుగేళ్ల వయసుకు వచ్చాక కుక్కపాలు తాగడం మొదలుపెట్టాడు. వీధుల్లో ఆడుకునేందుకు వెళ్లిన అతడు దార్లో కనిపించే ఊరి కుక్కలతో సహవాసం చేస్తూ వాటి పాలు తాగడం మొదలుపెట్టాడు. అక్కడి కుక్కలు కూడా అతడికి పాలు ఇవ్వడం ఇష్టపడేవి. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తూ ఉండే అతడి తల్లి ఒకసారి ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయింది. ఎన్నిసార్లు నియంత్రించి అతడికి ఇదే పరిస్థితి అలావాటైంది. ఇప్పుడు ఆ బాలుడికి పదేళ్లు.

ఇంటి చుట్టుపక్కల వారికి కూడా పలు చోట్ల అతడు కుక్కపాలు తాగుతూ కనిపించడంతో విసుగెత్తిపోయిన తల్లి ఇంట్లో పెట్టింది. అయినా అతడు రెండు వారాల కిందట బయటకు వెళ్లి మరో వీధిలోని కుక్క వద్దకు వెళ్లి దాని పాలుతాగేందుకు ప్రయత్నించగా అది కాస్త దాడి చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అతడికి ర్యాబిస్ రాకుండా వ్యాక్సిన్ వేశారు. కుక్కపాలతో ప్రాణాలకు ప్రమాదం లేదని అయితే, ర్యాబిస్ సోకే ప్రమాదం మాత్రం తప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు