100 కోట్లతో ‘బ్రాహ్మణ’ కార్పొరేషన్

18 Apr, 2016 03:50 IST|Sakshi

ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి
సాక్షి, న్యూఢిల్లీ: బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తెలంగాణలో త్వరలోనే రూ.100 కోట్లతో బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం ధన్వంతరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాలను ఒక్కటి చేసి బంగారు తెలంగాణ సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ధూపదీప నైవేద్య పథకం కింద రాష్ట్రంలోని ప్రతి అర్చకుడి ఖాతాలో రూ.6 వేలు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

మరిన్ని వార్తలు