చరిత్ర పుటల్లో 'పంజాబ్ మెయిల్'!

1 Jun, 2016 21:41 IST|Sakshi
చరిత్ర పుటల్లో 'పంజాబ్ మెయిల్'!

ముంబైః  మహరాష్ట్ర రాజధాని ముంబై నగరం నుంచి ప్రయాణీకులను తరలించే 'పంజాబ్ మెయిల్' చరిత్ర పుటల్లో నిలిచింది. ముంబై నుంచి ఫిరోజ్ పూర్ కు ప్రయాణీకులను చేరవేసే పంజాబ్ మెయిల్ 104 ఏళ్ళు పూర్తైన మొదటి భారతీయ రైలుగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.  రైల్వే చరిత్రలో సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించిన రైలుగా గుర్తింపు పొందింది.

స్వాతంత్రానికి ముందు 'ది పంజాబ్ లిమిటెడ్' గా పిలిచే మెయిల్ సర్వీస్ ను 1912 లో ప్రారంభించినట్లు ముంబై సెంట్రల్ రైల్వే వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. అప్పటి బాంబే, ఇప్పటి ముంబై నుంచి పెషావర్  ప్రయాణించే పంజాబ్ మెయిల్ మూలాలు మాత్రం పూర్తిగా లభించలేదు. 1911 ఖర్చు అంచనా కాగితాల ఆధారంగానూ...  1912 అక్టోబర్ 12న రైలు కొద్ది నిమిషాలు ఆలస్యం అవ్వడంపై ప్రయాణీకులు చేసిన ఓ ఫిర్యాదు ఆధారంగానూ... పంజాబ్ మెయిల్ తొలిసారి బల్లార్డ్ పీర్ మోల్ స్టేషన్ నుంచి 1912 జూన్ 1న ప్రారంభమైనట్లు అంచనా.

అప్పట్లో ఈ రైలు... ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రధాన ప్రకటనా మెయిల్ గా ఉపయోగపడినట్లు 1968 సెప్టెంబర్ 16 న తీసిన ఓ ఫొటోను బట్టి తెలుస్తోంది. ప్రజల్లో ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన పెంచడంలో భాగంగా... ఇద్దరు లేదా ముగ్గురు అన్న మెసేజ్ తో ప్రతిరోజూ ఈ రైలు ప్రయాణం సాగేది. అనంతరం ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన పెంచడంలో భాగంగా  చాలా రైళ్ళలో ఎర్రని త్రిభుజాకారం గుర్తును బర్త్ కంట్రోల్ సింబల్ గా వాడేవారు. అప్పట్లో భారత్ లో 55 కోట్లమంది జనాభా ఉండగా ప్రతి సంవత్సరం ఒక కోటి చొప్పున పెరుగుతూ ఇప్పటికి 150 కోట్లకు చేరింది.

>
మరిన్ని వార్తలు