11 వేల మంది బాలికలు అదృశ్యం

7 Apr, 2017 19:35 IST|Sakshi
11 వేల మంది బాలికలు అదృశ్యం

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్‌ ఎంపీ ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత విద్యాసంస్థల్లో చదువుకునే సుమారు 11వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని, వారి విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ ఛాయా వర్మ కోరారు. శుక్రవారం బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సందర్భంగా ఆమె మాట్లాడారు.

గిరిజన బాలికల హాస్టళ్లలో లైంగికదాడులు, కిడ్నాపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరాయని అన్నారు. వీటిపై అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని,  ఇందుకు సంబంధించి 2012 చట్టాన్ని సవరించాలని సూచించారు. దీనిపై స్పీకర్‌ కురియన్‌ స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి లేఖ రాయాలని సంబంధిత మంత్రిని కోరారు. బాలికలపై అత్యాచారాలు జరిగిన హాస్టళ్లు ఉంటే విచారణ జరిపి అటువంటి వాటిని మూసివేయించాలని కోరారు.

మరిన్ని వార్తలు