బస్సు ప్రమాదంలో 11 మంది మృతి

16 Feb, 2020 04:25 IST|Sakshi
ప్రమాదంలో ధ్వంసమైన బస్సు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సు ఉడుపి– చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్కళ తాలూకా మాళె సమీపంలో శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. బస్సు ఘాట్‌ రోడ్డులో వెళ్తుండగా అదుపు తప్పి కుడివైపు బండరాళ్లను అతివేగంతో బలంగా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. బస్సు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది.  ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఉడుపి జిల్లాలోని మణిపాల్, కార్కళలోని ఆస్పత్రులకు తరలించారు. మైసూరు జిల్లాకు చెందిన ఈ టూరిజం బస్సులో మొత్తం 35 మంది పర్యాటకులు ఉన్నారు. మైసూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులను విహార యాత్రకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 

మరిన్ని వార్తలు