ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి

31 Jan, 2015 21:50 IST|Sakshi
ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి

ఇండోర్: అనుమతి లేకుండా తన సైకిల్ తొక్కిందని ఏఎస్‌ఐ వేధించడంతో ఆత్మాహుతికి యత్నించిన పదకొండేళ్ల బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. రెండు రోజుల పాటు మత్యువుతో పోరాడిన బాలిక చివరకు తనువు చాలించింది. ఈ ఘటన ఇండోర్‌లో జరిగింది. గతనెల 29న స్థానిక సికింద్రాబాద్ కాలనీలో ఉంటున్న ఏఎస్‌ఐ ప్రకాష్ జరోలియాకు చెందిన సైకిల్‌ను యాస్మిన్ నడిపింది. తన అనుమతి లేకుండా యాస్మిన్ సైకిల్ నడపడంతో కోపోద్రిక్తుడైన జరోలియా ఆ బాలికను కొట్టడంతోపాటు, బాలిక, ఆమె తల్లిదండ్రులపై సైకిల్ దొంగతనం కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తానని బెదిరించాడు.

 

ఈ బెదిరింపులతో భయపడ్డ యాస్మిన్ తన ఇంటిలో ఆత్మాహుతికి యత్నించింది. వంద శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు