124 స్థానాల్లో కొత్త ముఖాలు 

30 Nov, 2018 00:46 IST|Sakshi

33 చోట్ల మాత్రం పాతకాపులే 

రాజస్తాన్‌ బరిలో పార్టీల వ్యూహ్యం

భారత్‌లో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సిట్టింగ్‌లకు లేదంటే గత ఎన్నికల్లో ఓడిన వారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. సిట్టింగ్‌ల విషయంలోనైతే రిస్క్‌ తీసుకోకుండా కొనసాగిస్తాయి. కొత్తవారికి తీసుకుని మళ్లీ మొదట్నుంచీ ప్రారంభించడం ఎందుకని ఆలోచిస్తాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్ప అభ్యర్థిని మార్చరు. కానీ రాజస్తాన్‌లో మాత్రం సీన్‌ పూర్తి భిన్నంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి సిట్టింగ్‌లను ఏకపక్షంగా విశ్రాంతినిచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మొత్తం 200 నియోజకవర్గాల్లో.. కేవలం 33 చోట్ల మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

29 సీట్లలో బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పోటీ చేస్తోంటే, 4 స్థానాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. వీరిలో మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఒకరు. బీజేపీ అభ్యర్ధులకు పోటీగా గత ఎన్నికల్లో వారి చేతిలో ఓడిపోయిన వారినే కాంగ్రెస్‌ మళ్లీ నిలబెట్టడం విశేషం. రెండు పార్టీలు 43 నియోజకవర్గాల్లో గత ఎన్నికల అభ్యర్ధులను మార్చాయి, 124 చోట్ల కొత్త ముఖాలకు అవకాశం కల్పించాయి.  

>
మరిన్ని వార్తలు