అమ్మకానికి 13 లక్షల పేమెంట్‌ కార్డుల డేటా

31 Oct, 2019 04:47 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్‌ కార్డుల వివరాలు డార్క్‌ వెబ్‌ అనే హ్యాకర్ల వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని హ్యాకర్లు ఓపెన్‌ సేల్‌లో ఉంచారు. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ. 922 కోట్లు కాగా ఒక్కో కార్డును దాదాపు రూ. 7వేలకు విక్రయిస్తున్నట్లుగా వెబ్‌సైట్లో ఉంచారు. డార్క్‌ వెబ్‌లోని జోకర్స్‌ స్టాష్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. కార్డుల వివరాలను ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మెషీన్ల ద్వారా సేకరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్డులకు ఉండే మాగ్నటిక్‌ స్ట్రిప్‌లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్‌ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్‌ కార్డుల వివరాలు హ్యాక్‌ చేసి ఓపెన్‌ సేల్‌లో ఉంచారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాక ఈ సమస్య

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి రైళ్లు...ఎందుకంటే!

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు!

వాళ్లను ఆదుకోండి: సోనియా

సినిమా

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?