ఒకే ఊళ్లో 14 మంది ముఖ్యమంత్రులు!

24 May, 2016 18:53 IST|Sakshi
ఒకే ఊళ్లో 14 మంది ముఖ్యమంత్రులు!

ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది ముఖ్యమంత్రులు ఒకే రోజు ఒకే ఊళ్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? అసోం కొత్త ముఖ్యమంత్రిగా సర్వానంద సోనోవాల్ ప్రమాణస్వీకారం చూడటానికి. అవును.. ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ సంబరాన్ని కళ్లారా చూసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలతో పాటు బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలో ఉన్న 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గువాహటి వెళ్లారు.

టీచర్‌గా పనిచేసిన ఒక గిరిజనుడు ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చాడంటూ సోనోవాల్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆయన తన ప్రసంగం ప్రారంభం, ముగింపు రెండూ అసామీ భాషలోనే చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరూ తమ ప్రసంగం చివర్లో భారత్ మాతాకీ జై అన్నారు. సోనోవాల్, హిమాంత బిశ్వ శర్మ ఇద్దరూ అస్సామీ భాషలోనే ప్రమాణస్వీకారం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన హిమాంతకు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు