అంత్యోదయ రైళ్లలో 15% అధిక చార్జీలు!

17 Feb, 2017 02:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యేకంగా సాధారణ తరగతి రైలు ప్రయాణికుల కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చార్జీలు..ప్రస్తుత జనరల్‌ క్లాస్‌ చార్జీల కన్నా దాదాపు 15 శాతం ఎక్కువగా ఉండొచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో, అన్నీ జనరల్‌ బోగీలతో ఈ రైళ్లను త్వరలో రైల్వే శాఖ పట్టాలెక్కించనుంది.

ఈ రకం రైళ్లు ప్రస్తుతానికి రెండు సిద్ధమయ్యాయి. ఒక రైలును ఈ నెలలోనే ముంబై–టాటానగర్‌ల మధ్య ప్రారంభించనుండగా, రెండో రైలును కూడా త్వరలోనే ఎర్నాకులం–హౌరా మధ్య నడిపిస్తారు.

>
మరిన్ని వార్తలు